TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న 'ఫర్నిచర్ ఫ్యూజన్' షోరూమ్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు నుండి మంటలు, దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.