హైదరాబాద్‌లోని కింగ్స్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం (వీడియో)

11చూసినవారు
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ప్రముఖ కింగ్స్ రెస్టారెంట్‌లో మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్