ఎమ్మెల్యే బైరాన్ బిస్వాస్ ఇంట్లో అగ్ని ప్రమాదం

5చూసినవారు
ఎమ్మెల్యే బైరాన్ బిస్వాస్ ఇంట్లో అగ్ని ప్రమాదం
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా ధులియాన్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సాగర్ దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే బైరన్ బిస్వాస్ ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే బిస్వాస్ గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన MLAణు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా బిస్వాస్, ఇటీవల డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్