TG: హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బస్ భవన్ సెల్లర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెల్లర్లో నిల్వ ఉంచిన పాత టైర్లు, తుక్కు సామాగ్రికి మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.