TG: నల్గొండ ఆర్టీసీ డిపోలో నిలిపి ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. సూపర్ డీలక్స్ బస్సులో మంటలు, పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇతర బస్సులకు మంటలు వ్యాపించకుండా వెంటనే ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో మంటలు వచ్చాయని ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు.