అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలో చెలరేగిన మంటలు

8చూసినవారు
అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలో చెలరేగిన మంటలు
బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులోని ఓ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైలును షంటింగ్ చేస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రైలు పెట్టెల నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్