TG: సంగారెడ్డి జిల్లా నందికంది సమీపంలోని 65వ జాతీయ రహదారిపై బుధవారం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు ఆపి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, కారు క్షణాల్లోనే పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.