ఫర్నిచర్‌ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

7చూసినవారు
TG: మేడ్చల్ చెక్‌పోస్ట్‌ వద్ద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. రోడ్డు పక్కన ఫర్నిచర్‌ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. రెండు ఫర్నిచర్‌ దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న మరికొన్ని దుకాణాలకూ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. రెండు దుకాణాల్లో ఫర్నిచర్‌, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత దుకాణాదారులు భారీగా నష్టపోయామని విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్