గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం(వీడియో)

0చూసినవారు
TG: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్‌ షాపులో సోమవారం మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.35లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్