
అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా.. వీడియో
AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ పరిధిలో సవరపాడు ఘాట్ రోడ్డులో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెనరాయ్ గ్రామానికి చెందిన సుమారు 40 మంది పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు బొలెరో వాహనంలో వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది.




