కేరళలోని కొట్టాయం సమీపంలో పతనంతిట్టకు వెళ్తున్న కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన సూపర్ డీలక్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మలప్పురం డిపోకు చెందిన ఈ బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. మణిమల సమీపంలో బస్సు టైర్ల నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడిన తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. అధికారులు మంటలను అదుపు చేసి, ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.