హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.