TG: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఈవీ బస్సులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు, బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.