TG: హైదరాబాద్‌లో మద్యం లోడుతో వెళ్తున్న లారీలో బుధవారం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హబ్సిగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లారీలో మంటలు రాగానే డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి వేశాడు. కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. అక్కడున్న కొందరు స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం వల్ల మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. కొందరు ఆ బాటిళ్ల కోసం ఎగబడ్డారు.