ఉల్లిగడ్డల షాపులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన రైతులు

2చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉల్లిగడ్డల షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో రైతులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్