మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చంద్‌వాడ్ ఘాట్ సెక్షన్ గుండా వెళుతున్న ఒక MSRTC బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 46 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.