సంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. వ్యవసాయ సబ్సిడీ పరికరాలు దగ్ధం

0చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోదాములో నిల్వ ఉంచిన రైతుల వ్యవసాయ సబ్సిడీ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైతుల అప్లికేషన్ పత్రాలు, కార్యాలయ పాత ఫర్నిచర్ సైతం మంటల్లో కాలిపోయాయి. గోదాంకు తాళం వేసి ఉండటంతో జేసీబీ సహాయంతో ఫైర్ సిబ్బంది రేకులు తొలగించి మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్