
ఇండిగో టికెట్ బుకింగ్‌లో సాంకేతిక లోపం
ఇండిగో విమానయాన సంస్థ టికెట్ బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ లోపాన్ని సరిచేసేందుకు సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వారు సాయం కోసం వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఇండిగో అధికారులు సూచించారు. ఈ సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ విచారం వ్యక్తం చేసింది.




