బీహార్‌‌లో ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

130చూసినవారు
బీహార్‌‌లో ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 6న 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక స్థానాల్లో భద్రతను పటిష్టం చేశారు. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 234 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడత పోలింగ్‌ నవంబర్‌ 11న, ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నాయి. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించారు.

సంబంధిత పోస్ట్