మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు : మంత్రి వాకిటి

15చూసినవారు
మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు : మంత్రి వాకిటి
రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, భారీగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు ఆహారంగా అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.  అలాగే  తెలంగాణలో ఉన్న దాదాపుగా 26వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్