అమెరికాలో ఆకాశం నుంచి చేపల వర్షం

6015చూసినవారు
అమెరికాలో ఆకాశం నుంచి చేపల వర్షం
అమెరికాలో ఆకాశం నుంచి పెద్ద మొత్తంలో చేపలు పడుతున్నాయి. టెక్సాస్‌లోని టెక్సార్కానాలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. భారీ సరస్సులు, సముద్రాలపై ఏర్పడే శక్తివంతమైన సుడిగాలులు, సుడిగుండాలు నీటితో పాటు చేపలను ఆకాశంలోకి తీసుకెళ్లి, ఆపై భూమిపైకి వదలడం వల్లే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. హోండురాస్‌లోని యోరో నగరంలో ఈ చేపల వర్షాన్ని 'లువియా డి పెసెస్' అని పిలుస్తూ, ప్రతీ సంవత్సరం పండగలా జరుపుకుంటారు. గతంలో కాలిఫోర్నియా, సైబీరియా, కేరళ, తెలంగాణ, యూపీ వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :