
ఆసియా కప్ ట్రోఫీ నిరాకరణపై పాక్ మీడియా విమర్శలు
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ విజేత భారత జట్టు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్తాన్ మీడియా భారత్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదాన్ని తమ జట్టు ఓటమికంటే ఎక్కువగా హైలైట్ చేస్తూ, భారత్ క్రికెట్లోకి రాజకీయాలను తీసుకువచ్చిందని పాకి మీడియా ఆరోపించినట్లు తెలుస్తోంది. మైదానంలో ఓటమి, మైదానం వెలుపల వివాదాలు పాకిస్తాన్ క్రికెట్‌ను మరింత చిక్కుల్లో పడేశాయని క్రికెట్ ప్రేమికులు చర్చించుకుంటున్నారు.




