భారీ క్రేన్‌ కూలి ఐదుగురి మృతి.. 12 మందికి గాయాలు

3చూసినవారు
భారీ క్రేన్‌ కూలి ఐదుగురి మృతి.. 12 మందికి గాయాలు
TG: ప్రమాదవశాత్తు క్రేన్‌‌లు కుప్పకూలి ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి.  ఈ ఘటన HYD​ శివారులోని శంకర్​పల్లి మండలంలో జరిగింది. ఎన్​సీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఈదురు గాలులు, వర్షం కురుస్తుండటంతో అక్కడే ఉన్న షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో ఈదురు గాలులకు క్రేన్లు షెడ్డు మీద కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు మార్గం మధ్యలో మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు ముఖేశ్​, నాగేంద్ర మాథుర్​ (ఝార్ఱండ్​), అలీ హుస్సేన్​, సాజిన్ ​(బిహార్​), సోను (యూపీ​)గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్