కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో DJ వాహనం విద్యుత్ తీగను తాకడంతో ఐదుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని మైసూరుకు తరలించగా, మరో ముగ్గురికి మడికేరిలో చికిత్స అందిస్తున్నారు.