జమ్మూకశ్మీర్‌లో కుండపోత వర్షం కారణంగా వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులు సంభవించాయి. జమ్మూ రీజియన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.