యువతులపై లైంగిక దోపిడీ కేసు ..మరో ఐదుగురు అరెస్ట్

19చూసినవారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు యువతులపై లైంగిక దోపిడీకి పాల్పడిన కేసులో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర ఆజాద్ అలియాస్ అర్జున్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించగా, అతని తల్లి మీనా కుమారి, మేనమామ ప్రశాంత్, స్నేహితులు వినీల్ చౌదరి, హేమంత్, జితిన్‌లు ఈ నేరాల్లో సహకరించినట్లు తేలింది. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నెట్‌వర్క్, బాధితుల వివరాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.