ఐదేళ్ల బాలుడి కిడ్నాప్.. ఇటుకలు, కత్తితో దాడి చేసి దారుణ హత్య

20643చూసినవారు
ఐదేళ్ల బాలుడి కిడ్నాప్.. ఇటుకలు, కత్తితో దాడి చేసి దారుణ హత్య
దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో మంగళవారం దారుణ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. ఇటుకలు, కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. బాలుడి తండ్రి వద్ద పనిచేసే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వద్ద నీతూ, వసీం అనే ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం నీతూ, వసీం మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో బాలుడి తండ్రి జోక్యం చేసుకుని నీతూను కొట్టాడు. బాలుడి తండ్రిపై కక్షసాధింపులో భాగంగా చిన్నారిని నీతూ కిడ్నాప్ చేసి హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్