ఆకాశంలో ఎగురుతున్న ఫ్లెమింగో పక్షుల అందాలు ఆకట్టుకుంటున్నాయి. నీలి సముద్రంపై వందలాది పింక్ ఫ్లెమింగోలు ఒకేసారి ఎగురుతున్న దృశ్యం మైమరిపిస్తోంది. ఈ దృశ్యాలను కెమెరామెన్ డ్రోన్‌తో అద్భుతంగా బంధించారు. అయితే ఈ క్రమంలో సుమారు రూ.4 లక్షల విలువైన డ్రోన్ ఉప్పు నీటిలో పడిపోయింది. డ్రోన్ పోయినా కానీ.. విజువల్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని దానికి సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు.