మొంథా తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.