ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

33239చూసినవారు
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు IMD అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.