నేపాల్‌లో ఆకస్మిక వరదల బీభత్సం.. భారత్‌లోని ఆ దేశ ఎంబసీ కీలక ప్రకటన

11051చూసినవారు
నేపాల్‌లో ఆకస్మిక వరదల బీభత్సం.. భారత్‌లోని ఆ దేశ ఎంబసీ కీలక ప్రకటన
నేపాల్‌లో మెరుపు వరదల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదుల నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని నేపాల్ టూరిజం బోర్డు కోరింది. అలాగే అత్యవసర నంబర్లు: టోల్‌ఫ్రీ: 1234, హాట్‌లైన్: 1144, టూరిస్ట్ పోలీస్: 9851289445 నెంబర్లను కూడా ఉంచింది. భారత ప్రభుత్వంతో అవసరమైన సమన్వయం చేసేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని భారత్‌లోని నేపాల్ ఎంబసీ ప్రకటించింది. భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం +977 9851316807, +977 9709107500 నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్