ఆకస్మిక వరదలు.. ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు

1చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ క్రమంలో రూన్‌ నదిలో వరద ప్రవాహం పెరిగింది. అయితే ఆ నదిలో బనారసీ దాస్‌ (65), అన్షుల్‌ (32) అనే ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా విఫలమయ్యారు. దీంతో సమాచారం మేరకు ఆర్మీ సాయం అందించింది. హెలికాప్టర్‌ సాయంతో వారిని సురక్షితంగా కాపాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్