
జొమాటోలో రెట్టింపు ధరలంటూ వివరించిన మహిళ!
జొమాటోలో ధరల వ్యత్యాసాన్ని నళిని అనే మహిళ సోషల్ మీడియాలో వెల్లడించారు. త్రిశివ్ చైనీస్ కార్నర్లో రూ. 320కు లభించే భోజనం జొమాటోలో డిస్కౌంట్ల తర్వాత రూ. 550, ఆఫర్లు లేకుంటే రూ. 655గా ఉందని తెలిపారు. ధరలను రెస్టారెంట్లే నిర్ణయిస్తాయని జొమాటో చెప్పగా, యాప్లు 25–30% కమిషన్ వసూలు చేయడమే ధరల పెరుగుదలకు కారణమని నెటిజన్లు విమర్శించారు.




