రోజుకు అరగుప్పెడు అవిసె గింజలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గ
ుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, మధుమేహాన్ని నియంత్రించడంలోనూ ఇవి సహాయపడతాయి. నేరుగా తినడం కష్టమైతే, పిండి చేసి బెల్లంతో క
లిపి లడ్డూలా తీసుకోవచ్చు. అవిసె నూనెను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.