ఇండిగో ఎయిర్‌లైన్స్ పసిపిల్లల తల్లిదండ్రుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. నవంబర్ 30 వరకు దేశీయ రూట్లలో 0–24 నెలల వయస్సు గల పిల్లలు కేవలం ₹1కే ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో అధికారిక వెబ్‌సైట్ goIndiGo.in ద్వారా బుకింగ్స్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. చెక్-ఇన్ సమయంలో పుట్టిన సర్టిఫికేట్ లేదా వ్యాక్సినేషన్ రికార్డ్ వంటి వయస్సు ధృవీకరణ పత్రాలు చూపాలి. ఒక్క విమానంలో ఒక వ్యక్తితో ఒక శిశువుకే అనుమతి ఉంటుంది.