విమానాన్ని ఢీకొన్న పక్షుల గుంపు

31252చూసినవారు
విమానాన్ని ఢీకొన్న పక్షుల గుంపు
ఇటీవల జెడ్డా విమానాశ్రయంలో 200 మంది ప్రయాణికులతో ల్యాండ్ అవుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-300 విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్న పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారు. టెక్నికల్ సిబ్బంది పరిశీలించగా బయట భారీగా వాటి అవశేషాలు కనిపించాయి. ఒకవేళ ఇంజిన్ లోకి పోయి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని అన్నారు. విమానాశ్రయం చుట్టూ పారిశుద్ధ్యం లోపించడం వల్ల అక్కడికి వచ్చి ఉంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.