మెక్సికో దేశంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు ఈ వరదల్లో 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వందలాది మంది గాయాలపాలయ్యారు. మరి కొందరు వరదల్లో గల్లంతు కాగా వారికోసం అధికారులు గాలిస్తున్నారు. వరదలకు రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.