బీహార్ లో వరద నీటి ఉధృతి.. కుప్పకూలిన రోడ్డు (వీడియో)

5చూసినవారు
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా వద్ద గండక్ నది రికార్డు స్థాయిలో ప్రవహిస్తోంది. నేపాల్ నుంచి భారీగా వరద నీరు రావడంతో నది ఉధృతికి ప్రధాన రహదారి కుప్పకూలి కొట్టుకుపోయింది. దీనితో మంగళ్‌పూర్, గహిరి గ్రామాల మధ్య రవాణా స్తంభించింది. నది ఉధృతికి కరకట్టలు తెగిపోవడంతో డజన్ల కొద్దీ గ్రామాలు, వాల్మీకి టైగర్ రిజర్వ్ అడవుల్లోకి వరద నీరు చేరింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్