ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద.. రైతులకు ఊరట

2919చూసినవారు
ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద.. రైతులకు ఊరట
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం పెరిగింది. గురువారం ఆనకట్ట నీటిమట్టం 9.2 అడుగులకు చేరగా, ప్రధాన కాల్వకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత మూడు నెలలుగా తుంగభద్రలో నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతులు, నదీతీర ప్రజలకు ఈ వరద కొంత ఊరటనిస్తోంది. వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుకోవడంతో పంటల సాగుకు అవకాశం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్