రోజంతా ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు

71చూసినవారు
రోజంతా ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో  నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి సెన్సెక్స్‌ 81,773.66 పాయింట్ల వద్ద 153.09 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 25,046.15 వద్ద 62.15 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీ, కన్జ్యూమర్‌ డ్యూయరబుల్‌ షేర్లు మినహా మిగిలిన రంగాలు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.80గా ఉంది.
Job Suitcase

Jobs near you