
విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు
గ్యాస్ గీజర్లు వేర్వేరు చోట్ల ముగ్గురి ప్రాణాలను తీశాయి. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి మృతి చెందారు. యూపీలోని బఘ్పట్లో అభిషేక్ అనే యువకుడు బాత్రూమ్లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల చనిపోయాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచాడు. గ్యాస్ గీజర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




