మూత్రంలో నురగ రాగానే కిడ్నీలు పాడైపోయాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా మూత్రం రావడం, డీహైడ్రేషన్, టాయిలెట్ క్లీనింగ్ ఉత్పత్తుల ఎఫెక్ట్ వంటి సాధారణ కారణాలు కూడా కావచ్చని అంటున్నారు. అయితే, నురగ ఎక్కువసేపు ఉంటే, అది ప్రోటీన్యూరియాకు సంకేతం కావచ్చట. ఇది కిడ్నీ సమస్యను సూచిస్తుంది. కాళ్లు, కళ్ల చుట్టూ వాపులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు.