ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Aug 19, 2026, 05:08 IST/

రాత్రంతా ఛార్జింగ్.. ఉదయాన్నే వేడెక్కి పేలిన మొబైల్ (వీడియో)

Aug 19, 2026, 05:08 IST
TG: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయిన మాదారం నవీన్ కుమార్ అనే యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. ఉదయం జేబులో ఉన్న ఫోన్ వేడిగా అనిపించడంతో బయటకు తీస్తుండగానే ఒక్కసారిగా పేలిపోయింది. సమయానికి ఫోన్‌ను జేబులో నుంచి బయటకు తీయడంతో యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కిందా లేక బ్యాటరీలో సాంకేతిక లోపం వల్ల పేలిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో మొబైల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.