
స్కూల్ భవనం కూలి ముగ్గురు మృతి(వీడియో)
ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ భవనం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 38 మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 60 మందికి పైగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణ లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. స్కూల్ భవనం సమీపంలో చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.




