గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత

10చూసినవారు
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ఉదయం అల్పాహారం వికటించి 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్ తిన్న కొద్దిసేపటికే వాంతులు, కడుపునొప్పి రావడంతో వారిని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్