TG: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం దర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 110 మంది విద్యార్థులు అవస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాంతులు, వీరేచనాలతో విద్యార్థులు బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.