జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం బీసీ బాలుర హాస్టల్‌లో 55 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఆహార భద్రత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈనెల 24 ఉదయం 11 గంటలకు సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ బి.ఎం.సంతోష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాములును విధుల నుంచి సస్పెండ్ చేశారు.