హైదరాబాద్‌లో 19 కేఫ్‌లు, స్నాక్ పాయింట్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు

21చూసినవారు
హైదరాబాద్‌లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా 9 బృందాలు 19 కేఫ్‌లలో దాడులు చేసి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రత, ఈగలు-బొద్దింకల బెడదను గుర్తించారు. కఠిన చర్యల్లో భాగంగా.. మదీనాలోని 'షాదాబ్ హోటల్' లైసెన్స్ సస్పెండ్ చేయగా, 'డ్రీమ్జ్ కెఫెటీరియా', 'ఏషియాటిక్ కేఫ్'లను మూసివేశారు. కల్తీ అనుమానంతో 15 ఆహార నమూనాలను పరీక్షలకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు కేఫ్‌లకు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్