
'అఖండ 2' మూవీలో ఇద్దరు కుమారులతో సర్ప్రైజ్ ఇచ్చిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన నాలుగో సినిమా 'అఖండ 2: తాండవం' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. 'అఖండ' సినిమాని ఎక్కడ ముగించారో అక్కడి నుంచే కథ ప్రారంభించారు. బోయపాటి తన ఇద్దరు కుమారులను ఈ సినిమాలో భాగం చేశారు. పెద్ద కుమారుడు హర్షిత్ స్పెషల్ కాన్సెప్ట్స్ అందించడంతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. చిన్న కుమారుడు వర్షిత్ ప్రహ్లాదుడి పాత్రలో కనిపించాడు.




