
ప్రియురాలిని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు!
AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమిస్తున్న హసీనా ఉద్యోగంలో చేరాక తనను పట్టించుకోవట్లేదనే అనుమానంతో బాల సైదులు ఆమెను హత్య చేశాడు. మాట్లాడదామని పిలిపించి కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద కత్తితో పొడిచి చంపేశాడు. ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సగం కాలిన శరీరాన్ని గుర్తించారు. నేరం ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.




